Sunny Leone: చారిత్రక నేపథ్యంలో సన్నీలియోన్ బహుభాషా చిత్రం .. కత్తియుద్ధంలో శిక్షణ!

  • భారీ చారిత్రక చిత్రంలో సన్నీలియోన్
  • కత్తియుద్ధం .. గుర్రపుస్వారీలో శిక్షణ  
  • ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • 70 నిమిషాల పాటు గ్రాఫిక్స్  

బాలీవుడ్ లోనే కాదు .. దక్షిణాది భాషల్లోను సన్నీలియోన్ కి విపరీతమైన క్రేజ్ వుంది. శృంగార దేవతగా కుర్రకారు ఆమె సౌందర్యాన్ని ఆరాధిస్తూ వుంటారు. అలాంటి సన్నీలియోన్ గ్లామర్ కి ఇప్పుడు రాజసం కూడా తోడుకానుంది. కైపెక్కే చూపులతో చంపేస్తూ వస్తోన్న సన్నీలియోన్ ఇక కత్తులు దూయడానికి సిద్ధమవుతోంది. అవును, ఆమె ప్రధాన పాత్రగా ఒక చారిత్రక చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది.

పోన్స్ స్టీఫెన్ నిర్మాణంలో వి.సి.వడివుడయన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో 70 నిమిషాల పాటు గ్రాఫిక్స్ వుంటాయట. ఈ సినిమా కోసం 150 రోజుల కాల్షీట్స్ కేటాయించిన సన్నీలియోన్, కత్తియుద్ధంతో పాటు .. ఇతర యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకుంటోందని అంటున్నారు. ఈ సినిమా కోసం నవదీప్ .. నాజర్ లను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.     

More Telugu News