Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మంచి పాత్రలు వస్తున్నాయంటున్న కాజల్ 
  • వెంకటేశ్, తేజ సినిమాకి ముహూర్తం 
  • నాని 'వాల్ పోస్టర్'లో భాగమవుతున్న తారలు  
  • 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలు


*  ఇటీవలి కాలంలో తనకు వస్తున్న పాత్రలు సంతృప్తికరంగా ఉంటున్నాయని అంటోంది అందాలభామ కాజల్. "గతంతో పోల్చుకుంటే కనుక గత మూడేళ్ల నుంచీ నాకు వస్తున్న పాత్రలు బాగుంటున్నాయి. పాత్ర వినగానే వదులుకోబుద్ధి కావడం లేదు. అందుకే, చేసేస్తున్నాను. ఆ విధంగా ఇటీవలి కాలంలో నా కెరీర్ సంతృప్తికరంగా ఉందనే చెప్పాలి" అని చెప్పింది.      
*  వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ రేపు (సోమవారం) రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి జరుగుతుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది తెరకెక్కుతుంది. దీనికి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నారు.
*  వినూత్న కథా చిత్రాలలో నటించే నేచురల్ స్టార్ నాని 'వాల్ పోస్టర్' పేరిట సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా 'అ!' పేరిట ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ నచ్చడంతో రవితేజ, కాజల్, నిత్యా మీనన్ వంటి తారలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు.    
*  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఏర్పడి పాతికేళ్లు అయిన సందర్భంగా నిన్న హైదరాబాదులో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి, సీనియర్ నటుడు రాళ్లపల్లిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీతారలు ఉత్సాహంగా పాల్గొన్నారు.    

More Telugu News