abboori ravi: కథ చెప్పడం నాకు రావడం లేదన్నారు .. ఇక సెకండాఫ్ చెప్పలేదు: సినీ రచయిత అబ్బూరి రవి

  • ప్రముఖ నిర్మాతను కలుసుకున్నాను 
  • ఫస్టాఫ్ 6 గంటల పాటు చెప్పాను 
  • 'గంటసేపు నడిచే కథను గంటలోనే కదా చెప్పాలి' అన్నారాయన

తెలుగులో సినీ రచయితగా అబ్బూరి రవి చాలా చిత్రాలకి పని చేశారు. తన గురించి తాను పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తిత్వం ఆయనది. తన కథలు మాట్లాడాలనేది ఆయన ఉద్దేశం. అలాంటి అబ్బూరి రవి తన కెరియర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటనను గురించి ప్రస్తావించారు. కథ బాగా రాయగానే సరిపోదు .. దానిని అంతకంటే అద్భుతంగా చెప్పడం రావాలి అంటూ .. తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు.

"త్రివిక్రమ్ కి ఓ అయిదు కథలను చెప్పగా ఆయన ఓ రెండు కథలను ఓకే చేశారు. ఆ కథలను నిర్మాత వేమూరి సత్యం గారికి చెప్పమని అన్నాడు. నేను వెళ్లి ఆయనను కలుసుకుని ఫస్టాఫ్ ను 6 గంటలపాటు చెప్పాను. అంత సమయంలో నేను చాలా బాగా కథ చెప్పేశాను అని అనుకుంటున్నాను. అప్పుడు వేమూరి సత్యం గారు ఒక మాట అన్నారు. "కథ బాగుంది రవి .. కానీ నీకు చెప్పడం రావడం లేదు" అన్నారు.

"నీ సినిమా ఎంతసేపు ఉంటుంది?" అని అడిగారు. "రెండు గంటలు ఉంటుంది సార్" అని చెప్పాను. "ఫస్టాఫ్ ఎంత సేపు ఉంటుంది?" అని అడిగితే ఓ గంటసేపు ఉంటుంది .. " అన్నాను. "మరి నువ్ ఎన్ని గంటలు చెప్పావ్?" .. "6 గంటలు చెప్పాను .. " ఫస్టాఫ్ గంట ఉంటే గంటనే కదా చెప్పాలి .. 6 గంటలు చెబితే ఎలా?" అని అడిగారు. ఇక నేను సెకండాఫ్ చెప్పలేదు వచ్చేశాను .." అంటూ చెప్పారు. 

More Telugu News