pavan: వారణాసిలో షూటింగ్ పూర్తి చేసిన 'అజ్ఞాతవాసి'

  • కాశీ నుంచి తిరిగొచ్చిన 'అజ్ఞాతవాసి' టీమ్
  • సంగీత దర్శకుడిగా అనిరుథ్ 
  • 18 .. 19 తేదీలలో ఆడియో రిలీజ్ 
  • జనవరి 10వ తేదీన సినిమా విడుదల  

చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఇటీవలే 'అజ్ఞాతవాసి' టీమ్ 'కాశీ' వెళ్లింది. అక్కడే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది.

అక్కడి నుంచి తిరిగొచ్చిన ఈ సినిమా టీమ్ ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టనుంది. ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. ఆయన అందించిన ఆల్బమ్ ను ఈ నెల 18వ తేదీన గానీ .. 19వ తేదీన గాని విడుదల చేయనున్నారు. కథాకథనాలతో పాటు పవన్ యాక్షన్ సీన్స్ .. పాటలు ఈ సినిమా హైలైట్స్ లో భాగం కానున్నాయని చెబుతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కీర్తి సురేష్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      

More Telugu News