youtube: యూ ట్యూబ్ దుమ్ము దులిపేస్తోన్న ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ ట్రైల‌ర్‌!

  • మార్వెల్‌ స్టూడియోస్ తెర‌కెక్కిస్తోన్న‌ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’
  • భారీ యాక్షన్‌ సన్నివేశాలు
  • విడుదలైన 24 గంటల్లోనే 2.30 కోట్ల‌కు పైగా వ్యూస్‌

మార్వెల్‌ స్టూడియోస్ తెర‌కెక్కిస్తోన్న‌ ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ హాలీవుడ్ సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్‌ దుమ్ముదులిపేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 2.30 కోట్లమందికి పైగా నెటిజ‌న్లు ఈ ట్రైలర్‌ను చూశారు. ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది  మే 4 న విడుద‌ల చేయ‌నున్నారు. కాగా, భార‌త్‌లో మాత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 27నే  ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ విడుదల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ వ్యూస్ 66 మిలియ‌న్లు దాటిపోయాయి. మీరూ చూడండి...


More Telugu News