elephants: ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంటి ముందుకు వ‌చ్చేసిన ఏనుగులు!

  • త‌మిళ‌నాడు కోయంబత్తూరులోని పెరియానైకెన్ పాళాయంలో ఘ‌ట‌న‌
  • ఆహారం దొర‌క్క‌పోవ‌డంతో వెన‌క్కి వెళ్లిపోయిన ఏనుగులు
  • ఎటువంటి విధ్వంసానికి పాల్ప‌డ‌ని గజరాజులు 

సాధార‌ణంగా ఏనుగుల‌ని జూలోనో, అట‌వీ ప్రాంతంలోనో చూస్తాం. ఒక్కోసారి అవి పొలాల్లోకి వ‌చ్చేసి పంట‌లను నాశ‌నం చేస్తుంటాయి. ఆహారం కోసం వెతుకుతూ ఓ ఏనుగుతో పాటు మరో గున్న‌ ఏనుగు ఓ ఇంటి ముందుకు వ‌చ్చేసిన ఘ‌ట‌న త‌మిళ‌నాడు కోయంబత్తూరులోని పెరియానైకెన్ పాళాయంలో వెలుగులోకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ ఇంటి ముందు కారు, బైకులు ఉన్నాయి. ఏదైనా ఆహారం దొరుకుతుందేమోన‌ని వెతికిన ఆ ఏనుగులు.. అక్క‌డ తిన‌డానికి ఏమీ క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో వెన‌క్కి వెళ్ల‌పోయాయి. ఆ ఇంటి ముందు ఉన్న ఏ వ‌స్తువునీ ధ్వంసం చేయ‌లేదు. మీరూ చూడండి..   

More Telugu News