samanta: నాగ్ సపోర్ట్ తో 'యూటర్న్' నిర్మాతగా సమంత!

  • కన్నడలో హిట్ కొట్టిన 'యూటర్న్' 
  • తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయాలనుకుంటోన్న సమంత
  • అందుకు నాగ్ నుంచి పూర్తి సపోర్ట్ 
  • జర్నలిస్టుగా కనిపించనున్న సమంత

కన్నడలో మిస్టరీ నేపథ్యంలో వచ్చిన చిత్రాల జాబితాలో 'యూటర్న్' ముందువరుసలో కనిపిస్తుంది. గత ఏడాది కన్నడలో హిట్ కొట్టిన చిత్రాలలో ఇది ఒకటి. శ్రద్ధా శ్రీనాథ్ .. రోగర్ నారాయణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అక్కడ మంచి ఆదరణ లభించింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లోకి రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో సమంత వుంది.

నాగ్ సపోర్ట్ చేయడంతో రంగంలోకి దిగిన సమంత, ఇటీవలే చైతూతో కలిసి బెంగళూర్ వెళ్లి .. ఈ సినిమా రీమేక్ విషయమై దర్శకుడు పవన్ కుమార్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనే దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.    

More Telugu News