valmiki boya reservations: వాల్మీకి, బోయలను ఎస్టీలలో చేర్చుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం

  • నెరవేరిన వాల్మీకి, బోయల కల
  • ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం
  • బోయలు దయనీయ స్థితిలో ఉన్నారన్న సీఎం

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాల్మీకి, బోయలను ఎస్టీల జాబితాలో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానించింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, వీరిని ఎస్టీల్లో చేర్చాలని నిన్ననే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించామని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తామనే అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాల్మీకి, బోయలు ఎస్టీలుగా ఉన్నారని చెప్పారు. వీరిని ఎస్టీలుగా చేర్చేందుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని తెలిపారు.

వాల్మీకి, బోయలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నారని... కడు దయనీయమైన స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. మన దేశంలో ఉన్న 33 గిరిజన గ్రూపుల్లో వీరిని కూడా నిర్ధారిస్తున్నామని తెలిపారు. నిబంధనల మేరకు ఎస్టీలకు ఉండాల్సిన అన్ని అర్హతలు వీరికి ఉన్నట్టు శాసనసభ భావిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఎస్టీల్లో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా వీరిని ఎస్టీల్లో చేరుస్తామని తెలిపారు.

More Telugu News