mukesh ambani: నాకు డబ్బు ముఖ్యం కాదు... నా దగ్గర క్రెడిట్ కార్డు కూడా లేదు!: ముఖేష్ అంబానీ

  • ఎక్కడికైనా వెళ్తే నా అవసరాలను ఎవరో ఒకరు చూసుకుంటారు
  • 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుంది
  • 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది

తనకు డబ్బు ముఖ్యం కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, తాను డబ్బు గురించి ఆలోచించే వ్యక్తిని కాదని అన్నారు. తన వద్ద క్రెడిట్ కార్డు కూడా లేదని ఆయన చెప్పారు. డబ్బుకంటే వనరులే ముఖ్యమని ఆయన చెప్పారు.

తానెక్కడికైనా వెళ్తే, తన అవసరాలకు ఎవరో ఒకరు డబ్బులు చెల్లిస్తారని ఆయన తెలిపారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్న ఆయన, 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2004లో 500 బిలియన్ డాలర్లు కాగా, మరో 20 ఏళ్లలో అది 5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని ఆయన అంచనా వేశారు. అన్నీ సజావుగా జరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థ మరో పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లు దాటి 2030 లోపు 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

More Telugu News