sanny leone: యాహూ సెర్చ్ లో మళ్లీ అగ్రస్థానంలో సన్నీలియోన్!

  • యాహూలో అధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్లలో అగ్రస్థానం స‌న్నీలియోన్‌ది
  • ఆ త‌రువాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్
  • న‌టుల్లో తొలి స్థానం వినోద్ ఖ‌న్నాది

ఈ ఏడాది చివ‌రి నెల‌లోకి ప్రవేశించేశాం.. యాహూ త‌మ సెర్చ్ ఇంజిన్‌లో నెటిజ‌న్లు అత్య‌ధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌డం ప్రారంభించింది. ఈ ఏడాది యాహూలో అధికంగా సెర్చ్ చేసిన భార‌త సినిమా హీరోయిన్లలో మొద‌టి స్థానంలో మళ్లీ సన్నీలియోన్ నిలిచింది. త‌న త‌రువాతే ఎవ్వ‌రైనా అన్న‌ట్లు ఆ శృంగార న‌టి దూసుకుపోతోంది. ఆమె త‌రువాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్ ఉన్నారు.

ఇక నటుల విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది మృతి చెందిన‌ వినోద్‌ ఖన్నా మొద‌టి స్థానంలో ఉన్నారు. ఆయ‌న మృతి చెందిన సమయంలో వివ‌రాలు తెలుసుకునేందుకు అధిక‌మంది యాహూలో శోధించారు. రెండో స్థానంలో కపిల్‌ శర్మ ఉన్నారు.

More Telugu News