Tirupati: హోటల్, మల్టీ ప్లెక్స్... తిరుపతి రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుంది!!

  • అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి
  • ఆకర్షించే ఫౌంటెన్ లు, జియో మెట్రిక్ రూఫ్ టాప్
  • అదనంగా మరో నాలుగు ప్లాట్ ఫామ్ లు
  • సమూలంగా మారిపోనున్న తిరుపతి రైల్వేస్టేషన్

ప్రతిపాదిత విస్తరణ, అభివృద్ధిలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ సమూలంగా మారిపోనుంది. తిరుపతి ఉత్తరం వైపు ప్రవేశద్వారం తాజా డిజైన్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆవరణలోనే హోటల్, ప్లాజా, మల్టీప్లెక్స్ నిర్మితం కానున్నాయి. జియోమెట్రిక్ రూఫ్ టాప్ డిజైన్ నిర్మితం కానున్న అదనపు హంగుల్లో భాగంగా వాటర్ ఫౌంటెన్ లూ, ఆకర్షించే కళాకృతులనూ ఏర్పాటు చేస్తారు.

ఇప్పటికే తిరుపతి స్మార్ట్ నగరాల్లో చోటు చేసుకోగా, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన తిరుపతి రైల్వే స్టేషన్ ను రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అథారిటీ, నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లు అభివృద్ధి చేయనున్నాయి. పీపీపీ మోడల్ లో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ సేకరణ తుది దశకు చేరిందని, ఆరో నంబర్ ప్లాట్ ఫాం నుంచి పనులు ప్రారంభిస్తామని, మరో నాలుగు ప్లాట్ ఫాంలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్ల నిర్వహణా కేంద్రాన్ని తిరుచానూరుకు తరలిస్తామని తెలిపారు.

More Telugu News