India: నాడు అధ్యక్షుడిగా, నేడు అతిథిగా... ఢిల్లీ చేరుకున్న బరాక్ ఒబామా

  • లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొననున్న ఒబామా
  • స్వాగతం పలికిన అధికారులు
  • ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరంలో విశిష్ట అతిథిగా న్యూఢిల్లీకి వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరోసారి ఇండియాకు వచ్చారు. న్యూఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, 'హిందుస్థాన్ టైమ్స్' నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఒబామాకు ప్రొటోకాల్ అధికారులతో పాటు, యూఎస్ ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు.

ఒబామా ఫౌండేషన్ నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఆపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఒబామా చర్చలు జరుపుతారని అధికారులు తెలిపారు. టౌన్ హాల్ లో జరిగే కార్యక్రమంలో దాదాపు 300 మంది ఔత్సాహిక యువకులతో మమేకమై, వారికి తన సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. కాగా, నాడు అధ్యక్షునిగా ఇండియాకు వచ్చిన ఒబామా, నేడు మాజీ అధ్యక్షుని హోదాలో పర్యటిస్తుండటం గమనార్హం.

More Telugu News