krishna: 'అల్లూరి సీతారామరాజు' విషయంలో అలా జరిగింది!: జి.ఆదిశేషగిరిరావు

  • అందువలన కృష్ణ దర్శకత్వం చేశారు 
  • ఎస్వీఆర్ కి బదులుగా బాలయ్యను తీసుకున్నాం 
  • సత్యనారాయణ చేయవలసిన పాత్రను ప్రభాకర్ రెడ్డికి ఇచ్చాం
  • చింతపల్లి ఫారెస్టులో 30 రోజులు షూటింగ్ చేశాం    

"రామారావుగారు 'జయసింహ' తరువాత 'అల్లూరి సీతారామరాజు' సినిమాను చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆయన చేస్తే మేం చేయకూడదనుకున్నాం .. ఆయన చేయరని తెలిసి మేం మొదలుపెట్టాం. ఈ సినిమా మొదటిరోజు షూటింగ్ పూర్తి కాగానే దర్శకుడు వి. రామచంద్రరావు అనారోగ్యానికి లోనయ్యారు. దాంతో దర్శకత్వ బాధ్యతలను కృష్ణ తీసుకున్నారు" అని చెప్పారు కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు.

 "యాక్షన్ సీన్స్ మినహా మిగతా భాగమంతా కృష్ణ గారే చూసుకున్నారు. ఈ సినిమాలో 'అగ్గిరాజు' పాత్ర కోసం ఎస్వీ రంగారావు గారిని అనుకున్నాం. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, బాలయ్యను తీసుకున్నాం. అలాగే 'మల్లుదొర' పాత్రను కైకాల సత్యనారాయణతో చేయించాలనుకున్నాం. డేట్స్ కుదరకపోవడంతో .. ప్రభాకర్ రెడ్డిని తీసుకున్నాం. చింతపల్లి ఫారెస్టులో 400 మందితో 30 రోజుల పాటు షూటింగ్ చేశాం" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News