rasikhanna: కోలీవుడ్ లో రాశి ఖన్నా జోరు పెరగడం ఖాయమట!

  • జయం రవికి జోడీగా రాశి ఖన్నా
  • ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ 
  • ఆమెకి మరిన్ని ఛాన్సులు ఖాయమంటూ టాక్       

తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. 'జై లవకుశ' సినిమాతో ఈ ఏడాది ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా, త్వరలో 'ఆక్సిజన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. రవితేజతో చేస్తోన్న 'టచ్ చేసి చూడు' .. వరుణ్ తేజ్ తో చేస్తోన్న 'తొలిప్రేమ' సెట్స్ పై వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళంలోను క్రేజ్ ను సంపాదించుకునే ప్రయత్నాల్లో వుంది.

 ప్రస్తుతం ఆమె జయం రవి జోడీగా ఓ తమిళ సినిమా చేస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాశిఖన్నా చేస్తోన్న పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుందట. ఈ పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకువస్తుందని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనీ .. దాంతో కోలీవుడ్లో రాశి ఖన్నా జోరు పెరగడం ఖాయమని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.     

More Telugu News