samsung: చైనా ఫోన్లకు శాంసంగ్‌ షాక్‌.. జస్ట్ 12 నిమిషాల్లోనే చార్జింగ్ చేసే బ్యాటరీల ఆవిష్కరణ!

  • వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీలను తయారు చేసిన శాంసంగ్
  • 12 నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ ఛార్జ్ అవుతుంది
  • గ్రఫెనీ బాల్ టెక్నాలజీతో చైనా ఫోన్లకు షాక్

ఇప్పుడొస్తున్న మొబైల్ ఫోన్లలో క్విక్ ఛార్జింగ్ కూడా కీలక అంశంగా మారింది. ఈ విషయంలో చైనా ఫోన్లు ఇతర దేశాల ఫోన్ల కంటే ముందున్నాయి. తాజాగా, చైనా ఫోన్లకు దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ షాక్ ఇచ్చింది. అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీలను తయారు చేసింది. 'గ్రఫెనీ బాల్' గా పిలిచే ఈ టెక్నాలజీ సహాయంతో, సాధారణ ఛార్జింగ్ సమయం కంటే ఐదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుందట. దీనికి తోడు, బ్యాటరీ సామర్థ్యం కూడా 45 శాతం పెరుగుతుందట.

ఆలోట్రోఫ్ ఆఫ్ కార్బన్ సమ్మేళనం కలిగిన గ్రఫెనీ మెటీరియల్ తో శాంసంగ్ ఈ బ్యాటరీలను తయారు చేస్తోంది. సిలికాన్ తో పాటు ఇతర పదార్థాలకు పత్యామ్నాయంగా దీన్ని వినియోగిస్తోంది. తర్వాతి తరం స్మార్ట్ ఫోన్లకు గ్రఫెనీ బాల్ టెక్నాలజీ మరింత బలం చేకూర్చనుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 12 నిమిషాల్లోనే బ్యాటరీ ఛార్జ్ అవుతుందని పేర్కొంది. 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా ఈ బ్యాటరీలు తట్టుకోగలవు.

More Telugu News