Niharika Konidhela: తమిళ సినిమాలో మెగా హీరోయిన్ నిహారిక లుక్ పై ప్రశంసలు.. టీజర్ చూడండి!

  • కోలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న నిహారిక
  • విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ కీలక పాత్రలు
  • ఆకట్టుకుంటున్న ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' టీజర్

 మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన నిహారిక తొలి సినిమా 'ఒక మనసు'తో మంచి పేరుతెచ్చుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించినంత సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' సినిమాలో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రను ఆమె దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం టీజర్ విడుదల కాగా, ఇప్పటికే దీనిని 2 లక్షలకు పైగా అభిమానులు వీక్షించారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ తదితరులతో నిహారిక నటించింది. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను మీరు కూడా చూడండి. 

More Telugu News