North Korea: 'నేటి క్షిపణి ప్రయోగంతో నా లక్ష్యం నెరవేరింద'న్న కిమ్ జాంగ్ ఉన్

  • రాకెట్ శక్తిని సాధించాలన్న లక్ష్యం నెరవేరింది
  • 4,475 కిలోమీటర్లు ప్రయాణించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే పదిరెట్లు ఎక్కువ ఎత్తు 

రాకెట్ శక్తిని సాధించాలనే లక్ష్యం నెరవేరిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. సరికొత్త శక్తిమంతమైన క్షిపణి 4,475 కిలోమీటర్ల ఎత్తులో, 950 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లిందని ప్రకటించారు. ఈ ఎత్తు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే పది రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ క్షిపణినిని ప్రయోగించిన అనంతరం అది సరిగ్గా 53 నిమిషాల పాటు 950 కి.మీ. దూరం ప్రయాణించిందని ఆయన తెలిపారు. దీంతో సుదూరతీరాలను కూడా తమ మిసైల్ చేరగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంతో తమ లక్ష్యం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రయోగంతో తిరుగులేని అణ్వాయుధ శక్తిగల దేశంగా ఎదగాలన్న తమ చిరకాల వాంఛ నెరవేరిందని స్పష్టం చేసింది. తమ దేశం అణ్వాయుధ సామర్థ్యం గల బాధ్యతాయుతమైన దేశమని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదుల అణ్వాయుధ బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్ నుంచి కాపాడుకోవడానికే వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని ఆయన స్పష్టం చేశారు.  

More Telugu News