chidambaram: ఇవాంకా మాట్లాడింది యూపీఏ ప్ర‌భుత్వం గురించి... ట్వీట్ చేసిన చిదంబరం

  • 130 మిలియ‌న్ల మందిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేసింది త‌మ ప్ర‌భుత్వమ‌ని వ్యాఖ్య‌
  • 2004 నుంచి 2014 వ‌ర‌కు తాము సాధించిన విజ‌యమ‌న్న మాజీ ఆర్థిక‌మంత్రి
  • నిజానికి 140 మిలియ‌న్ల మంది అని చుర‌క‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ మాట్లాడింది యూపీఏ పాల‌న గురించని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబ‌రం అన్నారు. 130 మిలియ‌న్ల మందిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కి తీసుకువ‌చ్చింది త‌మ ప్ర‌భుత్వ‌మ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

'130 మిలియ‌న్ల మందిని పేద‌రికం నుంచి బ‌య‌టికి తీసుకువ‌చ్చార‌ని ఇవాంకా అన్న మాట‌లు యూపీఐ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించిన‌వి. వాస్తవానికి 2004 నుంచి 2014 మ‌ధ్య దాదాపు 140 మిలియ‌న్ల మంది పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు' అని చిదంబ‌రం ట్వీటారు. భార‌త‌దేశ అభివృద్ధిని పొగుడుతూ ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌లో ప్ర‌సంగించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News