falaknuma palace: ఫలక్ నుమా ప్యాలస్ కు బాంబు బెదిరింపుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశం!

  • మోదీ, ఇవాంకా, కేసీఆర్ లు విందారగిస్తున్న సమయంలో బెదిరింపు కాల్
  • రాత్రంతా పోలీసుల తనిఖీలు 
  • ఇవాంకా వెళ్లిపోయిన వెంటనే ప్రారంభం కానున్న విచారణ

హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలస్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు 1500 మంది నిన్న రాత్రి విందు ఆరగిస్తున్న సమయంలో... బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫలక్ నుమా ప్యాలస్ పరిసరాల్లో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు.

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు... రాత్రంతా తనిఖీలను మాత్రం నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు, ఈ కాల్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాంకా హైదరాబాద్ టూర్ ముగియగానే విచారణను ప్రారంభించనున్నారు పోలీసులు. ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాత బస్తీ నుంచే ఈ కాల్ వచ్చినట్టు నిర్ధారించారు.

More Telugu News