Allu Arjun: గోవాలో షూటింగ్ కి రెడీ అవుతోన్న బన్నీ

  • హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న 'నా పేరు సూర్య' 
  • రేపటి నుంచి గోవాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • తెలుగుతో పాటు మలయాళంలోను విడుదల చేసే ఆలోచన

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా, ఆ మధ్య ఊటీలో చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఇటీవల ఈ సినిమా హైదరాబాద్ లోను ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా టీమ్ గోవా చేరుకుంది .. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ అక్కడ మొదలవుతుంది. ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ కీలకపాత్రలను చేస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.       

More Telugu News