cpec: చైనా చిచ్చు.. భారత్-పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం: విల్సన్ సెంటర్

  • సీపీఈసీ ప్రాజెక్టు వల్ల ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయి
  • భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది
  • పాక్ స్వయంగా తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసుకుంటోంది

భారీ బడ్జెత్ తో నిర్మితమవుతున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అమెరికాకు చెందిన మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల భారత్-పాకిస్థాన్ ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకునే అవకాశం ఉందని విల్స్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్ మెన్ స్పష్టం చేశారు.

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ను నిర్మించడమే చైనా ప్రధాన లక్ష్యమని... అయితే, ఈ వ్యవహారం చివరకు భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించడం పాకిస్థాన్ వల్ల కాదని.. మరోవైపు, సీపీఈసీ ప్రాజెక్ట్ లో భాగమైన విద్యుత్ ప్రాజెక్టుల వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు పాక్ అవసరాలకు ఏమాత్రం సరిపోదని తెలిపారు.

చైనా కోరికల మేరకు పాకిస్థాన్ పని చేస్తోందని... ఇది పాకిస్థాన్ తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను స్వయంగా నాశనం చేసుకోవడమేనని కూగల్ మెన్ చెప్పారు. ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ప్రాజెక్టు ముందుకు సాగితే, ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News