KTR: తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరు?: మహిళా సాధికారత గురించి చెబుతున్న కేటీఆర్ కి ఎదురైన ప్రశ్న

  • కేటీఆర్ ముందు ఆసక్తికర ప్రశ్న
  • మంత్రి పదవులపై నిర్ణయం సీఎందే
  • సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారు
  • మహిళా బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్న కేటీఆర్

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మహిళలకు అవకాశాలు, సాధికారతపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న వేళ, ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంలో చాకచక్యంగా స్పందించిన కేటీఆర్, "మా పార్టీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి పదవులపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలన్న వాదనకు మేము కట్టుబడివున్నాం. మహిళా బిల్లుకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది" అని సమాధానం ఇచ్చారు.

More Telugu News