Tenth: పది, పన్నెండు తరగతుల ఉత్తీర్ణత కనీస మార్కుల శాతం తగ్గింపు.. ఐసీఎస్ఈ బోర్డు నిర్ణయం!

  • 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు
  • బోర్డు నిర్ణయంతో గణనీయంగా పెరగనున్న ఉత్తీర్ణత శాతం
  • ఇతర బోర్డులతో సమానంగా ఉండాలనే ఈ నిర్ణయం

పది, పన్నెండు తరగతుల విద్యార్థుల ఉత్తర్ణీతకు అవసరమైన కనీస మార్కుల శాతాన్ని తగ్గించాలని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) బోర్డు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తోంది. ఇతర బోర్డులతో సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థుల కనీస ఉత్తర్ణీత మార్కుల శాతం 35 కాగా, పన్నెండో తరగతి విద్యార్థుల కనీస ఉత్తీర్ణత 40 శాతంగా ఉండేది. ఇకపై దీనిని వరుసగా 33, 35 శాతానికి తగ్గించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఎస్ఈ సీనియర్ అధికారులు తెలిపారు. ఐసీఎస్ఈ నిర్ణయంతో పది, పన్నెండు తరగతుల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News