Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఫ్రాన్స్ షూటింగ్ పూర్తి చేసుకుంటున్న 'క్వీన్'
  • వెంకటేశ్ తో అనిల్ రావిపూడి ప్రాజక్ట్  
  • అఖిల్ తో పాటు అమెరికాకి నాగార్జున, రానా 
  • అల్లరి నరేశ్ మరో కామెడీ చిత్రం 

*  హిందీలో హిట్టయిన 'క్వీన్' చిత్రాన్ని తెలుగులో తమన్నా నాయికగా అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నీలకంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా ఫ్రాన్స్ లో జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారానికి అక్కడి షెడ్యూలు పూర్తవుతుందని సమాచారం. అక్కడి నుంచి వచ్చాక దక్షిణాదిన పలు ప్రాంతాలలో మిగతా షూటింగ్ నిర్వహిస్తారు.
*  'రాజా ది గ్రేట్' సినిమా సక్సెస్ తర్వాత యువ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని సీనియర్ హీరో వెంకటేశ్ తో చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో వెంకటేశ్ తో పాటు ఓ యువ హీరో కూడా ఉంటాడు. ఆ పాత్ర కోసం దర్శకుడు అనిల్ పలువురిని సంప్రదిస్తున్నట్టు, త్వరలోనే ఒకరిని ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది.
*  అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం 'హలో' ప్రమోషన్ కోసం డిసెంబర్ 15 నుంచి అమెరికాలో పర్యటిస్తాడు. ఇందులో భాగంగా న్యూజర్సీ, డల్లాస్, శాన్ జోస్ నగరాలలో లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు. నాగార్జున, రానా కూడా అఖిల్ తో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
*  కామెడీ హీరో అల్లరి నరేశ్ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసుకున్నాడు. తమిళంలో హిట్టయిన ఓ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో నరేశ్ తో 'సుడిగాడు' వంటి హిట్టును తీసిన భీమనేని శ్రీనివాసరావు దీనికి దర్శకత్వం వహిస్తాడు.

More Telugu News