Ivanka Trump: ఫలక్‌నుమా విందుకు ఇవాంకాను గుర్రపు బగ్గీలో తీసుకెళ్లిన అధికారులు!

  • చారిత్రక ప్యాలెస్‌లో భారతీయ వంటకాలతో విందు
  • గేటు నుంచి గుర్రపు బగ్గీలో లోపలికి చేరుకున్న ఇవాంకా
  • నారా బ్రాహ్మణి, ఉపాసన సహా పలువురు హాజరు

హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక సదస్సు (జీఈఎస్)కు హాజరైన పలువురు ప్రముఖులకు చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. హెచ్ఐసీసీలో తొలి రోజు జీఈఎస్ ప్రారంభ సదస్సు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ, ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, శోభా కామినేని, ప్రతాప్ సి.రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి, నారా బ్రాహ్మణి, ఉపాసన, సంజయ్ బారుతోపాటు సదస్సుకు హాజరైన పలువురు పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు.

ఫలక్‌నుమా ప్యాలెస్ వద్దకు చేరుకున్న శ్వేతసౌధ సలహాదారు ఇవాంక ట్రంప్‌ను అధికారులు గేటు దగ్గరి నుంచి ప్యాలెస్‌లోకి గుర్రపు బగ్గీలో తీసుకెళ్లారు. బగ్గీలో కూర్చున్న ఇవాంకా ప్యాలెస్‌ను పరిశీలిస్తూ ముందుకు సాగారు. విందు సందర్భంగా ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందులో భారతీయ రుచులను అతిథులకు వడ్డించారు.  విందు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు, ఇవాంక ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లిపోయారు.

More Telugu News