bsnl: యూజ‌ర్ల ముందు బీఎస్‌ఎన్‌ఎల్ మ‌రో కొత్త ప్లాన్‌!

  • రూ.187ల ప్లాన్‌తో 1 జీబీ డేటా
  • అన్‌ లిమిటెడ్‌ (నేషనల్‌ రోమింగ్‌) కాల్స్
  • ఢిల్లీ, ముంబయి నగర యూజ‌ర్ల‌కు మాత్రం ఈ ప్లాన్ వ‌ర్తించ‌దు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మ‌రో కొత్త ప్లాన్‌తో త‌మ యూజ‌ర్ల ముందుకు వ‌చ్చింది. రూ.187ల ప్లాన్‌తో 1 జీబీ డేటాతోపాటు అన్‌ లిమిటెడ్‌ నేషనల్‌ రోమింగ్‌ కాల్స్ ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ 28 రోజుల కాల వ్య‌వ‌ధితో ఉంటుంది. ఇంత‌కు ముందు కూడా రూ.187ల ప్లాన్ ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడు అందులో ఉన్న ఆఫ‌ర్‌ల‌కి అద‌నంగా ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ప్లాన్‌ను ఢిల్లీ, ముంబయి నగర యూజ‌ర్లు తప్ప అన్ని ప్రాంతాల యూజ‌ర్లు అందుకోవ‌చ్చు. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో మిగ‌తా కంపెనీల‌న్నీ ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి.

More Telugu News