hmr: మెట్రో రైలు క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌...040-27772999

  • ఆవిష్క‌రించిన హైద‌రాబాద్ మెట్రో
  • బుధ‌వారం నుంచి మెట్రో సేవలు ప్రారంభం
  • స‌మ‌స్య‌లు, సందేహాల‌కు హెల్ప్‌లైన్‌

మెట్రోరైలుకి సంబంధించి గానీ, ప్ర‌యాణానికి సంబంధించి గానీ, లేదా మ‌రేదైనా సందేహం, స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం కోసం 040-27772999 నెంబ‌ర్‌కి డ‌య‌ల్ చేయాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్ర‌క‌టించింది. బుధ‌వారం నుంచి మెట్రో రైలు సేవ‌లు హైద‌రాబాదీల‌కు అందుబాటులోకి రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సందేహాల‌ను తీర్చ‌డానికి ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపుగా ప్ర‌యాణికుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా హెచ్ఎంఆర్ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ అవ‌గాహ‌నా రాహిత్యం కార‌ణంగా తలెత్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఈ హెల్ప్‌లైన్ బాగా ఉప‌యోగప‌డనుంది.

More Telugu News