Anushka Shetty: భారీ రేటుకు 'భాగమతి' తమిళ హక్కులు

  • అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి'
  • 35- 40 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
  • జనవరి 26న విడుదల 
  • తమిళంలోను ప్రేక్షకుల ముందుకు   

అనుష్క ప్రధాన పాత్రధారిగా 'భాగమతి' చిత్రం తెరకెక్కింది. దర్శకుడు అశోక్ రూపొందించిన ఈ సినిమా, జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

 అందువలన ఈ సినిమా తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. స్టూడియో గ్రీన్ వారు ఈ సినిమా తమిళ హక్కులను 15 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. యూవీ క్రియేషన్స్ వారు 35 - 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ .. క్వాలిటీ కారణంగా తమిళంలో ఈ స్థాయి రేటు పలికినట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

More Telugu News