స్లిమ్ గా మారిపోయిన అనుష్క.. ఫొటో ఇదిగో!

28-11-2017 Tue 12:37
  • నాజూగ్గా మారిన అనుష్క
  • బాబ్డ్ హెయిర్ తో న్యూలుక్ లో స్వీటీ
  • మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజం కావంటూ కామెంట్
ఎంతో స్లిమ్ గా ఉండే నటి అనుష్క... 'సైజ్ జీరో' సినిమా కోసం నిజంగానే బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత బరువు తగ్గే ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, అనుష్కను నాజూకుగా చూపించేందుకు 'బాహుబలి' యూనిట్ గ్రాఫిక్స్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదంతా గతం. అనుష్క మళ్లీ ఎంతో స్లిమ్ గా మారిపోయింది.

ఈ క్రమంలో తన తాజా ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. కొత్త అందంతో, బాబ్డ్ హెయిర్ తో ఆమె సరికొత్తగా కనిపిస్తోంది. ఈ ఫొటో కింద ఆమె ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. 'మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవు. అది సాధ్యం కావాలంటే చెమట చిందించాలి. కష్టించే తత్వం, పట్టుదల, దృఢ సంకల్పం అవసరం' అని పేర్కొంది.