miyapur: 'మెట్రో'పై మరో వివాదం... బల్దియా బాసుల కినుక!

  • మెట్రో పైలాన్ లో కనిపించని జీహెచ్ఎంసీ ప్రముఖుల పేర్లు
  • కనీసం మోదీతో కలసి రైలెక్కే అవకాశం పొందని మేయర్
  • నిత్యమూ శ్రమించే బల్దియా పెద్దలకు గుర్తింపెక్కడ?
  • ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లు!

భాగ్యనగర వాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరైన వేళ, మరో వివాదం తెరపైకి వచ్చింది. మెట్రో రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ, ఈ రోజు ప్రారంభిస్తుండగా, హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో నగరపాలక ప్రజా ప్రతినిధులకు, ఇంతకాలం శ్రమించిన అధికారులకు గుర్తింపు లభించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మెట్రో పైలాన్‌ లోనూ, ఎల్‌ అండ్‌ టీ విడుదల చేసిన బ్రోచర్‌లోనూ జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారి పేర్లేమీ లేవు.

 ఇక శిలాఫలకంపై కూడా నరేంద్రమోదీ, కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారకరామారావు పేర్లు మాత్రమే ఉన్నాయి. ప్రొటోకాల్ ప్రకారం నగర మేయర్, మియాపూర్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్లు కూడా ఉండాలని బల్దియా పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంచితే, కనీసం ప్రధాని మోదీతో కలిసి రైల్లో ప్రయాణం చేసేవారి జాబితాలో సైతం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేరును చేర్చకపోవడంపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News