ivanka trump: కళ్లు చెదిరే కాన్వాయ్ మధ్యలో హోటల్ చేరుకున్న ఇవాంకా.. వీడియో మీరూ చూడండి!

  • భారీ భద్రత మధ్య హోటల్ చేరుకున్న ఇవాంకా
  • భారీ కాన్వాయ్ ఏర్పాటు
  • గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొననున్న ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ఈ తెల్లవారుజామున 3.30కు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి భారీ భద్రత మధ్య ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఏర్పాటు చేసిన కాన్వాయ్ కళ్లు చెదిరే రీతిలో ఉంది.

భారీ సంఖ్యలో వాహనాలతో, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె ప్రయాణం కొనసాగింది. ఈ మధ్యాహ్నం హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో ఆమె పాల్గొంటారు. వేదికపై ఆమెతో పాటు భారత ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసీనులు కానున్నారు.  

More Telugu News