Titanic: అందుకే టైటానిక్ లో హీరో చనిపోయాడు: దర్శకుడు జేమ్స్ కేమరాన్

  • 1997లో విడుదలై ఘన విజయం సాధించిన టైటానిక్
  • 11 ఆస్కార్ అవార్డులు
  • క్లైమాక్స్ లో హీరో చనిపోవడంపై కెమెరాన్ వివరణ

చలన చిత్ర చరిత్రలో ‘టైటానిక్‌’ సృష్టించినంత సంచలనాన్ని ఏ చిత్రమూ సృష్టించలేదంటే అతిశయోక్తికాదు. హాలీవుడ్‌ లో లియోనార్డో డి కాప్రియో, కేట్‌ విన్‌ స్లెట్‌ ల జంటను కలల జంటగా ప్రపంచ ప్రేమికుల ముందు నిలిపిన ఆ సినిమా వివిధ విభాగాల్లో 11 ఆస్కార్‌ అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 'టైటానిక్' ప్రమాదం 1912లో చోటుచేసుకోగా, 1997లో సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ పై స్పందించాడు.

‘అతడు (హీరో) బతికి ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌ కు అర్థం ఉండేది కాదని అన్నారు. అసలు ఈ సినిమా నేపథ్యమే చావు, విడిపోవడం అనే అంశాలతో ముడిపడి ఉందని తెలిపారు. కథానుసారంగా అతను చనిపోవాల్సిందేనని అన్నారు. అది ఒక కళాత్మక నిర్ణయమని ఆయన తెలిపారు. అందుకే ఈ కథలో చివరి వరకు ఆమె పాత్రను ఉంచగలిగినా, అతడ్ని ఉంచడం సాధ్యం కాలేదని ఆయన చెప్పారు.

అలా జరిగింది కాబట్టే 20 ఏళ్ల తరువాత కూడా ఆ కథ గురించి మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. అయితే ఇలా ఒక సినిమా గురించి 20 ఏళ్ల తరువాత ఇప్పుడు మాట్లాడుకోవడం సరదాగా ఉందని ఆయన అన్నారు. ఈ కథలో హీరో పాత్రను చక్కగా తెరకెక్కించామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంత బాగా తెరకెక్కించాము కాబట్టే క్లైమాక్స్‌ లో అతను చనిపోయినప్పుడు ప్రేక్షకులు చాలా ఫీలయ్యారని ఆయన తెలిపారు.

More Telugu News