suicide attempt: కాలేజీ భ‌వ‌నంపై నుంచి దూకి.. ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

  • వరంగల్‌, హన్మకొండలోని ఏకశిల జూనియర్‌ కళాశాలలో ఘ‌ట‌న‌
  • ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తోన్న పోలీసులు
  • ఆసుప‌త్రిలో విద్యార్థిని సింధూజ ప‌రిస్థితి విష‌మం

వరంగల్‌, హన్మకొండలోని ఏకశిల జూనియర్‌ కళాశాలలో ఈ రోజు మ‌ధ్యాహ్నం క‌ల‌క‌లం చెల‌రేగింది. కాలేజీ బిల్డింగ్‌పైకి వెళ్లిన ఓ విద్యార్థిని అక్క‌డి నుంచి కింద‌కు దూకేసి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. ఆ విద్యార్థిని ఇంట‌ర్‌ సెకండియర్‌ చదువుతున్న కందగట్ల సింధుజగా తెలిసింది. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న ఆమెను లెక్చ‌ర‌ర్లు ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News