dog: యువ‌తిని కాపాడి.. దొంగ‌కు చుక్క‌లు చూపించిన వీధికుక్క‌!

  • రోడ్డుపై న‌డుచుకుంటూ వెళుతోన్న యువ‌తి
  • ఆమెను ఫాలో అవుతూ వ‌చ్చిన దొంగ‌
  • బ్యాగు లాక్కోబోతే, దాడి చేసిన వీధికుక్క‌

యూర‌ప్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది. పెంపుడు కుక్క కాక‌పోయినా ఓ శున‌కం ఓ యువ‌తిని కాపాడింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డుపై ఓ యువ‌తి న‌డుచుకుంటూ పోతోంది. ఆమెను ఫాలో అవుతూ ఓ దొంగ వ‌చ్చాడు.. ఒక్క‌సారిగా ఆమె చేతిలోని బ్యాగుని లాక్కోబోయాడు. ఆ దుండ‌గుడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆ యువ‌తి ప్ర‌య‌త్నించింది.

అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఓ గ్రామ‌సింహం ఆ దొంగ‌పై దాడి చేసింది. శున‌కం బారి నుంచి తప్పించుకోవ‌డానికి ఆ దొంగ అక్క‌డి నుంచి ప‌రుగులు తీశాడు. ఆ దొంగ వెన‌కాల ప‌డ్డ ఆ కుక్క చివ‌ర‌కు ఆ యువ‌తి జోలికి అత‌డు రాకుండా చేసింది. క‌ళ్ల‌ముందే సాటి మ‌నిషికి అన్యాయం జ‌రుగుతుంటేనే మ‌నుషులు ప‌ట్టించుకోకుండా వెళుతోన్న ఈ కాలంలో ఆ కుక్క చేసిన సాహసం అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.. 

More Telugu News