indonesia: అగ్ని పర్వతం పేలనుంది.. ప్రభుత్వ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్న ఇండోనేసియన్లు!

  • 17,000 చిన్న దీవుల సమూహం ఇండోనేసియా
  • బాలీకి దగ్గర్లోని అగ్నిపర్వతం మౌంట్ అగంగ్
  • ఏ క్షణమైనా బద్దలయ్యే అవకాశం

'గత వారం రోజులుగా మౌంట్ అగంగ్ నుంచి స్మోక్ వెలువడుతోంది. మరికొన్ని గంటల్లో ఇది బద్దలయ్యే అవకాశం ఉంది. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దగ్గర్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలి..' అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ఇండోనేసియన్లు ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచంలోనే భిన్నమైన భౌగోళిక ప్రత్యేకతలు గల ఇండోనేసియా 17,000 చిన్నదీవుల సమూహం. పసిఫిక్ మహాసముద్రంలోని టెక్టోనిక్ ప్లేట్లు తరచూ ఢీకొట్టుకోవడం వల్ల ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా ఎక్కువే. ప్రఖ్యాత పర్యాటక తీరం బాలికి సమీపంలో మౌంట్ అగంగ్ ఉంటుంది. ఇది బద్దలయ్యే ప్రమాదం ఉండడంతో బాలి విమానాశ్రయాన్ని మూసేశారు.

40,000 మంది ఇప్పటికే తమ నివాసాలను వదిలి వెళ్లగా, 60,000 మందిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తంగా ఇక్కడి నుంచి సుమారు లక్ష మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మౌంట్ అగంగ్ నుంచి వెలువడుతున్న పొగ గాల్లో మూడు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని, దీంతో విమానాశ్రయాన్ని కూడా మూసేశామని ప్రభుత్వం తెలిపింది. 

More Telugu News