Kamal Haasan: త‌న అభిమాని చెంప ఛెళ్లుమ‌నిపించిన క‌మ‌ల హాస‌న్‌!

  • ఇటీవ‌ల బెంగ‌ళూరులో ఘ‌ట‌న‌?
  • తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో
  • సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ త‌న అభిమాని చెంప ఛెళ్లుమ‌నిపించినట్లు ఉన్న ఓ వీడియో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చాలా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ వీడియోలో కమ‌ల హాస‌న్‌.. నటుడు రమేష్ అరవింద్‌తో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లి వ‌స్తున్నారు.

క‌మ‌ల్ మెట్లు దిగుతోన్న స‌మయంలో ఓ అభిమాని ఆయ‌న‌ను చూసి వెంటనే కరచాలనం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ అభిమానిని కమలహాసన్ లాగి కొట్టాడు. ఇటీవల బెంగళూరులో ఆ ఘటన జరిగిన‌ట్లు తెలుస్తోంది. క‌మ‌లహాస‌న్ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటోన్న స‌మ‌యంలో ఈ వీడియో బ‌య‌ట ప‌డ‌డం కమల్ కు కాస్త ఇబ్బందే అని చెప్పచ్చు.

More Telugu News