venkatesh: వెంకీ మూవీ లాంచ్ డేట్ ను ఖరారు చేసిన తేజ

  • తేజ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • డిసెంబర్ 13న సినిమా లాంచ్
  • అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • హీరోయిన్ కోసం అన్వేషణ         

తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన వెంకటేశ్ .. తేజను ఒక రేంజ్ లో మెచ్చేసుకున్నారు. అంతేకాదు .. ఆయనతో ఒక సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. అంతే .. చకచకా ఓ కథను తేజ సిద్ధం చేయడం .. వెంకీ కి వినిపించి ఓకే అనిపించడం జరిగిపోయాయి.

వచ్చేనెల 13వ తేదీన వెంకటేశ్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ డేట్ ను తేజ ఖరారు చేశాడు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇటు వెంకటేశ్ .. అటు తేజ ఇద్దరూ కూడా తమ తదుపరి ప్రాజెక్టులను 3 నెలల్లోనే మొదలుపెట్టవలసి వుంది. అందువలన ఆ లోగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నారు. 'ఆటా నాదే .. వేటా నాదే' అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచిన ఈ సినిమా కోసం, ముగ్గురు కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి మరి.          

More Telugu News