nano: నానో కార్ల ఉత్ప‌త్తిని ఆపేయ‌నున్న టాటా మోటార్స్‌?

  • ఆర్డ‌ర్లు లేక‌పోవ‌డమే కార‌ణం
  • 'రూ. ల‌క్ష‌కే సొంత‌కారు' అంటూ విడుద‌లైన నానో
  • క్ర‌మంగా తగ్గిపోయిన డిమాండ్‌

2009లో ల‌క్ష రూపాయ‌ల‌కే కారును సొంతం చేసుకోండంటూ విడుద‌లైన నానో కారు ఉత్ప‌త్తిని టాటా మోటార్స్ కంపెనీ త్వ‌ర‌లో నిలిపివేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. డీల‌ర్ల నుంచి పెద్ద‌గా ఆర్డ‌ర్లు లేక‌పోవ‌డంతో కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. గ‌త మూడు నెల‌ల్లో నానో కార్ల ఆర్డ‌ర్ల సంఖ్య విప‌రీతంగా త‌గ్గిపోయింది. ఆగ‌స్టులో 180 యూనిట్ల కోసం ఆర్డ‌ర్ రాగా, అక్టోబ‌ర్ నాటికి ఆ సంఖ్య 57కి ప‌డిపోయింది.

టాటా మోటార్స్ వారి ఇత‌ర ఉత్ప‌త్తులు టియాగో, టిగోర్‌, హెక్సా, నెక్సాన్ కార్ల‌ను ప్ర‌చారం చేస్తూ నానో కారు గురించి టాటా మోటార్స్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో వాటి డిమాండ్ తీవ్రంగా ప‌డిపోయింది. దేశంలో సాధార‌ణ వ్య‌క్తికి సొంత కారు క‌ల‌ను నిజం చేయాల‌నే ర‌త‌న్ టాటా ఆశ‌యం మొద‌ట్లో విజ‌య‌వంత‌మైన‌ప్ప‌టికీ, సంస్థ సరైన ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డంతో నిర్వీర్య‌మైంద‌ని డీల‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News