dil raju: హీరోగా మహేశ్ మేనల్లుడు .. నిర్మాతగా దిల్ రాజు!

  • మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ 
  • తెలుగు తెరపైకి హీరోగా 
  • మొదలైన సన్నాహాలు 
  • త్వరలో అధికారిక ప్రకటన   

టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేశ్ బాబుకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు అంటేనే అందరి దృష్టి ఆ వైపే ఉంటుంది. ఇక మహేశ్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తెరపైకి వస్తున్నారని తెలిసినా, అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. మహేశ్ మేనకోడలు ఓ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమవుతోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అవుతుందని కూడా చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు మేనల్లుడు కూడా హీరో అనిపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. మహేశ్ బాబు సోదరి పద్మావతి - బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్, హీరోగా సినిమా రంగంలోకి అడుగుపెట్టనున్నట్టుగా కొంత కాలం క్రితమే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కుర్రాడు నటనలో .. డాన్స్ .. ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడట. గల్లా అశోక్ ను హీరోగా దిల్ రాజు పరిచయం చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ద్వారా ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందట.   

More Telugu News