సార్... ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్: గిటార్ ప్లేయర్ తో రాంగోపాల్ వర్మ

Sun, Nov 26, 2017, 12:19 PM
  • రాంగోపాల్ వర్మ పాదాభివందనం
  • కళాకారుడి స్వర విన్యాసానికి ఫిదా
  • 'టైటానిక్' గీతాలను గిటార్ పై ప్లే చేసిన ఆర్టిస్ట్
తనతో పాటు తన శిష్య బృందాన్ని సంగీతంలో ఓలలాడించిన ఓ కళాకారుడికి దర్శకుడు రాంగోపాల్ వర్మ పాదాభివందనం చేశారు. మరో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మిలతో కలిసి వీకెండ్ పార్టీని ఎంజాయ్ చేసిన రాంగోపాల్ వర్మ, గిటార్ ప్లే చేస్తున్న కళాకారుడి స్వర విన్యాసానికి ముగ్ధుడయ్యాడు.

"సార్... ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్" అని వర్మ కితాబిచ్చాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న పూరీ జగన్నాథ్, ఇతనో త్యాగరాజు అని తనవంతు కితాబిచ్చాడు. సదరు కళాకారుడు ఆపై 'టైటానిక్' చిత్రంలోని గీతాన్ని ఆలపిస్తుంటే, అందరూ ఎంజాయ్ చేశారు. వర్మ టీమ్ లోని దాదాపు 15 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా, చార్మి స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha