sundeep kishan: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'నరగాసూరన్' టీజర్

  • కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరగాసూరన్' 
  • తెలుగులో టైటిల్ 'నరకాసురుడు'
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు      

ఈ మధ్య కాలంలో తెలుగు .. తమిళ భాషల్లో సస్పెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలాంటి సస్పెన్స్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ, ఈ రెండు భాషల్లోను 'నరగాసూరన్' ను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ .. అరవింద్ స్వామి .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నరకాసురుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం మ్యూజిక్ పై ఈ టీజర్ ను నడిపించారు. " ఏదో జరగబోతోంది .. అదేంటి?" అనే ఉత్కంఠను రేకెత్తించేలా ప్రధాన పాత్రలన్నీ ఉద్వేగానికి లోనవుతోన్న సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కార్తీక్ నరేన్ టేకింగ్ కి .. ఫొటోగ్రఫీ పనితీరుకు ఈ టీజర్ అద్దం పడుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News