rakul preet singh: ఆ హీరోయిన్ తో నన్ను పోల్చనే వద్దు: రకుల్ ప్రీత్ సింగ్

  • 'ధీరన్‌ అధిగారం ఒండ్రు' విడుదల
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా రకుల్
  • నయన్ తో పోలిక వద్దంటూ తప్పించుకున్న రకుల్

నిన్నమొన్నటి వరకూ అగ్ర నాయికల్లో ఒకరిగా వెలిగిన నయనతారతో మీరు పోల్చుకుంటారా? అన్న ప్రశ్నకు, నేటి తరం అందాల హీరోయిన్ రకుల్, తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకుంది. నయనతార ఓ సీనియర్ నటి అని, ఆమె తన నటనతో ఎన్నో భాషల్లో ఉత్తమ నటిగా నిరూపించుకుందని, ఇంకా తనకు అటువంటి పాత్రలు దక్కలేదని చెప్పేసి, అడుగుతున్న ప్రశ్నల నుంచి తప్పించుకుంది.

రకుల్ నటించిన  'ధీరన్‌ అధిగారం ఒండ్రు' హిట్ కాగా, ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. నయన్ ఉత్తమ నటిగా గుర్తింపు పొందారని, తనకు కూడా ఆమె నటించినటువంటి కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

More Telugu News