Padmavathi: విదేశాలకూ పాకిన ‘పద్మావతి’ సెగలు.. బ్రిటన్‌లో ఆందోళనలు!

  • ‘పద్మావతి’ క్లియరెన్స్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం
  • పునరాలోచించాలన్న రాజ్‌పుట్లు
  • బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ఆందోళన

వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ సినిమా ‘పద్మావతి’ సెగలు విదేశాలకూ పాకాయి. లండన్‌లోని రాజ్‌పుట్ సమాజ్ ‘పద్మావతి’ సినిమాను నిరసిస్తూ బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ఆందోళన నిర్వహించింది. సినిమా విడుదలకు బ్రిటన్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (బీబీఎఫ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్‌పుట్‌లు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. పద్మావతి సినిమాలో ఎటువంటి కట్‌లు లేకుండా ‘12ఎ’ రేటింగ్ ఇచ్చింది. అంటే పన్నెండేళ్లలోపు చిన్నారులు ఈ సినిమా చూసే అవకాశం లేదు.

బీబీఎఫ్‌సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసించిన రాజ్‌పుట్‌లు వెంటనే దానిని వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుట్ సమాజ్ హెడ్ హరేంద్ర సింగ్ జోధా మాట్లాడుతూ.. భారత్‌లో ఈ సినిమా వివాదం కొలిక్కి వచ్చి క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చే వరకు బ్రిటన్‌లో ఈ సినిమాను విడుదల చేయబోమని నిర్మాతలు హామీ ఇచ్చినట్టు చెప్పారు. కాగా, సర్టిఫికేషన్ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, నియమ నిబంధనల ప్రకారమే సర్టిఫికెట్ ఇచ్చినట్టు బీబీఎఫ్‌సీ పేర్కొంది.

More Telugu News