srikakulam: కోటి దీపోత్సవంలో అపశ్రుతి... ఉవ్వెత్తున లేచిన మంటలు... వీడియో చూడండి!

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • పరుగులు తీసిన భక్తులు
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నిర్వాహకులు

 శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కోటి దీపోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్తీకమాసం ముగిసిన తరువాత ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుండగా, నిన్న దీపోత్సవంలో ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అయింది. ప్రమాదవశాత్తూ మంటలు ఎగసి, క్షణక్షణానికీ పెద్దవి కాగా, భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. కోటి దీపోత్సవంలో ప్రమాదం వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News