anil ravipoodi: అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చిన వెంకటేశ్!

  • అనిల్ రావిపూడితో వెంకటేశ్ 
  • మల్టీస్టారర్ కి రంగం సిద్ధం 
  • మరో హీరోగా రానా లేదా చైతూ 
  • త్వరలో సెట్స్ పైకి    

నాగార్జున నిర్మాణంలో 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, తన తదుపరి సినిమాను వెంకటేశ్ తో చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా దూరం కొనసాగాయి. కానీ వెంకటేశ్ వెనక్కి తగ్గడంతో, రవితేజతో సినిమా చేయడానికి కల్యాణ్ కృష్ణ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక వెంకటేశ్ .. అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది మల్టీ స్టారర్ మూవీ కావడంతో .. మరో హీరోగా రానా గానీ .. చైతూ గాని చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. వెంకటేశ్ అడిగితే ఇద్దరూ కాదనరు గనుక .. సాధ్యమైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. రవితేజతో 'రాజా ది గ్రేట్' చేసిన అనిల్ రావిపూడి .. వెంకటేశ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతుంటే, వెంకీతో సినిమా చేయాలనుకున్న కల్యాణ్ కృష్ణ .. రవితేజతో సెట్స్ పైకి వెళుతుండటం విశేషం.  

More Telugu News