helicopter crash: సిద్దిపేటలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు పైలెట్లూ సేఫ్!

  • కొత్తగా కట్టిన కలెక్టర్ కార్యాలయం దగ్గర్లో ప్రమాదం
  • పూర్తిగా దగ్ధమైన విమానం 
  • చెల్లాచెదురుగా పడిన శకలాలు

తెలంగాణలోని సిద్ధిపేటలో చిన్నపాటి శిక్షణ విమానం కూలిపోయింది. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తగా కట్టిన కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పారాచూట్ సాయంతో వీరు క్షేమంగా బయటపడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News