saidharam tej: 'గ్యాంగ్ లీడర్' సీక్వెల్ చరణ్ చేస్తేనే బాగుంటుంది: సాయిధరమ్ తేజ్

  • 'గ్యాంగ్ లీడర్' సీక్వెల్ గురించిన ఊహాగానాలు
  • తాను చేయడం లేదని చెప్పిన బన్నీ 
  • తేజు చేయనున్నాడంటూ ప్రచారం 
  • ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టేసిన తేజు  

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గ్యాంగ్ లీడర్' ఒకటి. విజయబాపినీడు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలుగా మాస్ ఇమేజ్ వున్న చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ లకు మాత్రమే ఈ సీక్వెల్ చేసే ఛాన్స్ వుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఈ సీక్వెల్ గురించిన ప్రస్తావన అల్లు అర్జున్ దగ్గర వస్తే, "అది చరణ్ చేయవలసిన సినిమా" అని చెప్పేశాడు.

అయితే ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్ ను సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరూ స్టైల్ ను అనుకరించడం  .. ఆయన సినిమాల్లోని సాంగ్స్ ను రీమిక్స్ చేయడం వలన తేజూనే ఈ సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ అందులో నిజం లేదనే విషయం తాజాగా స్పష్టమైంది. 'జవాన్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ .. ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించాడు. " 'గ్యాంగ్ లీడర్' సీక్వెల్లో చేస్తారా?" అనే ప్రశ్న ఓ అభిమాని నుంచి ఎదురైంది." 'గ్యాంగ్ లీడర్' సీక్వెల్ చేస్తే చరణ్ చేయాలి .. ఆయన చేస్తేనే బాగుంటుంది" అనే అభిప్రాయాన్ని తేజు సూటిగా వ్యక్తం చేశాడు. దాంతో ఈ సినిమా తేజు చేస్తాడంటూ జరుగుతోన్న ప్రచారానికి తెర పడింది.     

More Telugu News