kim jong un: అణుదాడికి రంగం సిద్ధం.. కిమ్ జాంగ్ సెలెక్ట్ చేసిన ప్రాంతాలు ఇవే!

  • యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్న కిమ్ జాంగ్
  • టార్గెట్ లో వైట్ హౌస్ కూడా
  • ఈయూఎఫ్ఆర్ వెల్లడి

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణుదాడికి సిద్ధమవుతున్నారంటూ కీలక రిపోర్టులు అందుతున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ దీవులే లక్ష్యంగా ఆయన దాడులు జరగనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న 15 ప్రాంతాలను కిమ్ సెలెక్ట్ చేశారని, ఈ ప్రాంతాలపై అణుదాడులు జరగవచ్చని యూరోపియన్ కమిషన్ ఆఫ్ పారిన్ రిలేషన్స్ (ఈయూఎఫ్ఆర్) తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ ద్వారా ఈ సమాచారాన్ని సంపాదించగలిగామని వెల్లడించింది.

ఉత్తర కొరియా టార్గెట్ చేస్తున్న ప్రాంతాలు ఇవే:
అమెరికా: న్యూయార్క్, మన్ హట్టన్, పెంటగాన్, వైట్ హౌస్ లతో పాటు ఇతర ముఖ్య నగరాలు
జపాన్: టోక్యో, క్యోటో, ఒసాకా, మిసావా, మోకోహామా
దక్షిణ కొరియా: సియోల్, బుసాన్, గ్యాంనెయంగ్
గ్వామ్ దీవులు

More Telugu News