team india: రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక!

  • తొలి టెస్టులో ఒక్క వికెట్ తీయని స్పిన్నర్లు
  • రెండో వికెట్ తీసిన అశ్విన్
  • లంచ్ విరామానికి రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు

నాగ్ పూర్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు తొలిరోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బ్యాట్స్ మన్ కు టీమిండియా పేసర్లతో పాటు స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులు వేశారు. లంక బ్యాట్స్ మన్ క్రీజులో స్వేచ్ఛగా కదలలేని విధంగా బంతులేసి పరుగులు నియంత్రించారు.

దీంతో 20 పరుగుల వద్ద సమరవిక్రమ (13) ఇషాంత్ శర్మ బౌలింగులో ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను ఛటేశ్వర్ పుజారా అద్భుతంగా ఒడిసిపట్టగా, 25వ ఓవర్ చివరి బంతికి తిరుమన్నె (9) ను రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక జట్టు లంచ్ విరామ సమయానికి 47 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయని స్పిన్నర్లు రెండో టెస్టులో ప్రభావం చూపుతున్నారు. 

More Telugu News