rain: కోస్తా, తెలంగాణలకు వర్ష సూచన!

  • 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు
  • ప్రభావం చూపుతున్న తూర్పు గాలులు
  • తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం

నిన్న ఉదయం వరకు తెలంగాణలోని తాండూరు, నిర్మల్ లో 4 సెంటీమీటర్లు, రామగుండం, లక్సెట్టిపేటలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. తూర్పు గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పారు.

మరోవైపు అండమాన్ వద్ద సముద్రంలో నెలకొన్న అల్పపీడనం నిన్నటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి, 26వ తేదీకి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని చివరి ప్రాంతంలో తీరం దాటి, ఆ తర్వాత అరేబియా సముద్రంలో ప్రవేశించి, అక్కడ బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News